Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

పాల్వంచ ఘటన..సీఎం కేసీఆర్‌కు ఇవన్నీ తెలియవా..? : రేవంత్‌ రెడ్డి

పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవపై కఠినచర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ్డ ట్విట్టర్‌ వేదికగా డిమాండు చేశారు. రాఘవకు అధికార పార్టీ తెరాస వత్తాసు పలకడం దుర్మార్గమన్నారు. ఘటన జరిగి మూడురోజులైనా చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కుమారుడి అరాచకాలు సీఎం కేసీఆర్‌కు తెలియవా అని రేవంత్‌ నిలదీశారు. ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ ఏం చేస్తోందన్నారు. ప్రతిపక్షాల ప్రజాపోరాటాలపై నిఘాకే పరిమితమైందా అని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img