Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

పెండిరగ్‌ బిల్లులపై గవర్నర్‌ కామెంట్స్‌..

తెలంగాణ పెండిరగ్‌ బిల్లులపై గవర్నర్‌ తమిళి సై కీలక కామెంట్స్‌ చేశారు. పెండిరగ్‌ బిల్లుల అంశం పూర్తిగా తన పరిధిలోనే ఉంటుందని, త్వరలోనే వాటిపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్‌కు పంపిన బిల్లుల్లో 8 బిల్లులు ప్రస్తుతం పెండిరగ్‌లో ఉన్నాయి. పెండిరగ్‌ బిల్లులపై తన పరిధికి లోబడే తాను నడుచుకుంటానని, తాను ఎవరికీ వ్యతిరేకం కాదని తెలిపారు. తన బాధ్యత తెలుసుకుని పెండిరగ్‌ బిల్లులపై నిర్ణయాలు తీసుకుంటానని వెల్లడిరచారు. ఏనాడు తాను అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని… రాజ్‌భవన్‌లో తనకయ్యే ఖర్చును మొత్తం తానే భరిస్తున్నట్లు వెల్లడిరచారు. ప్రతినెలా తనకయ్యే ఖర్చును తానే సొంతంగా చెల్లిస్తున్నానని, ప్రభుత్వ సొమ్మును ఉపయోగించుకోవడం లేదని పేర్కొన్నారు.గవర్నర్‌ దగ్గర పెండిరగ్‌ లో ఉన్న బిల్లులలో అరు చట్టసవరణ బిల్లులతో పాటు రెండు కొత్త బిల్లులు ఉన్నాయి. అయితే వీటికి గవర్నర్‌ ఇప్పటివరకు అమోదం తెలపలేదు. యూనివర్సిటీ రిక్రూట్‌మెంట్‌ కామన్‌ బోర్డు బిల్లుతో పాటు మున్సిపాలిటీ చట్ట సవరణ, ఫారెస్ట్‌ యూనివర్సిటీ లాంటి పలు కీలక బిల్లులు పెండిరగ్‌లో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి -గవర్నర్‌కు మధ్య గ్యాప్‌ ఉన్న సంగతి తెలిసిందే. గవర్నర్‌ తమ పరిధి ధాటి ప్రవర్తించారని రాష్ట్ర ప్రజల నుండి వ్యతిరేకత సైతం వచ్చింది. రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులపై మాట్లాడని గవర్నర్‌..కేవలం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలుమార్లు మాట్లాడటాన్ని అంతా తప్పుబడుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img