Monday, January 30, 2023
Monday, January 30, 2023

పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.సాధారణ పరీక్షల్లో భాగంగా బుధవారం రాత్రి కరోనా టెస్టు చేయించుకున్నాని, అందులో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని చెప్పారు. కాగా.. మూడు రోజుల కిందటే తన మనువరాలి వివాహ వేడుకల్లో స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే. చంద్రశేఖర్‌ రావు, వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హాజరయ్యారు.. తనకు పాజిటివ్‌ రావడంతో అందరూ టెస్ట్‌ చేసుకోవాలని, ఐసోలేషన్‌లో ఉండాలని స్పీకర్‌ పోచారం కోరారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img