Friday, August 19, 2022
Friday, August 19, 2022

పోలవరంతో భద్రాచలానికి ముంపు ముప్పు

తెలంగాణ రాష్ట్రమంత్రి పువ్వాడ అజయ్‌
పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు పొంచి ఉందని..ఇటీవల వచ్చి వరద పరిస్థితులకు అదే కారణమని తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. పోలవరం బ్యాక్‌ వాటర్‌ వల్ల ఎన్నో గ్రామాలు వరద ముంపు బారిన పడుతున్నాయని చెప్పారు. ఈ డ్యామ్‌ వల్ల గోదావరి వరద ప్రవాహం నెమ్మదిగా వెళ్తోందని అన్నారు. పోలవరం డ్యామ్‌ ఎత్తును తగ్గించాలని గతంలోనే ఏపీ ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. భద్రాచలం పట్టణానికి వరద నుంచి శాశ్వత పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ. 1,000 కోట్ల రూపాయలను ప్రకటించారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆకాశ మార్గాన కాకుండా రోడ్డు మార్గాన వచ్చి వరద బాధితులను కలిశారని చెప్పారు. వరద బాధితులను ముంపు ప్రాంతాల నుంచి తరలిస్తామని… వారికి శాశ్వత గృహాలను కట్టిస్తామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను కొనసాగిస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img