Monday, December 5, 2022
Monday, December 5, 2022

పోలింగ్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తి : ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌

ప్రతి గ్రామంలో తనిఖీలు చేస్తున్నామని, ఇప్పటి వరకు మునుగోడులో 8.02 కోట్ల రూపాయలను సీజ్‌ చేయడం జరిగిందని మునుగోడు ఉప ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ అన్నారు. ఉదయం 5.30 గంటలోపు ఏజెంట్లంతా పోలింగ్‌ కేంద్రాలను చేరుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఉదయం 6 గంటలకు మాక్‌ పోలింగ్‌ ఉంటుంది అన్నారు. నిన్నటి దాడుల ఘటనపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.
పోలింగ్‌ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు.. సీపీ మహేష్‌ భగవత్‌
పోలింగ్‌ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు మోహరించడం జరుగుతుందని, రౌడీ షీటర్లను బైండోవర్‌ చేశామని సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. ప్రతి పోలింగ్‌ బూత్‌ కి ఒక ఎస్సైని నియమించడం జరిగిందన్నారు. రెండు వేల మంది పోలీస్‌ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img