Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

పోలీసు సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి

హోంమంత్రి మహముద్‌ అలీ
పోలీసు సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని హోం మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. గోశామహల్‌లో నిర్వహించిన పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో హోంమంత్రి పాల్గొని ప్రసంగించారు. విధి నిర్వహణ వీర మరణం పొందిన అమర వీరులకు ఘన నివాళి అర్పిస్తున్నానని అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్‌ కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. కరోనా క్లిష్టమైన సమయంలో తెలంగాణ రాష్ట్రంలో 62 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని…ఇందులో 10 మంది హోమ్‌ గార్డులు చనిపోయారన్నారు. కరోనా సమయంలో చనిపోయిన పోలీసులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంద ఆయన భరోసా ఇచ్చారు. గడిచిన ఏడేళ్ళలో ఎలాంటి మత ఘర్షణలు లేకుండా చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన బోనాలు, రంజాన్‌ పండుగలు ప్రశాంతంగా నిర్వహించామని అన్నారు. ప్రాణ త్యాగం చేసిన పోలీసు అమర వీరులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంమంత్రి మహమూద్‌ అలీ శ్రద్ధాంజలి ఘటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img