Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

ప్రగతిభవన్‌ను పేదలకు పంచుతాం : బండి సంజయ్‌

తెలంగాణలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదే క్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర బండి సంజయ్‌ ఒక్క అడుగు ముందుకు వేసి.. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ప్రగతిభవన్‌, ఫామ్‌హౌస్‌ను లక్ష నాగళ్లతో దున్ని ప్రజలకు పంచుతామని అన్నారు. రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద జరిగిన బడుగుల ఆత్మగౌరవ పోరు ధర్నాలో బండి సంజయ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.శాంతిభద్రతల పేరుతో బీజేపీ కార్యకర్తల్ని రాష్ట్రవ్యాప్తంగా అడ్డుకుంటున్నారని, పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని కేసీఆర్‌ ఎన్నోసార్లు అన్నారని విమర్శించారు. ఇప్పుడు అటవీసిబ్బందిని పంపి పంటలను నాశనం చేయిస్తున్నారని, ప్రభుత్వం పోడు భూముల సమస్యను పరిష్కరించాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.
సీఎంకు దళితులు, గిరిజనులపైన చిత్తశుద్ధి లేదన్నారు. మూడెకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్‌ ఒక్కొక్క దళితుడికి రూ.10 లక్షలు కాదు.. రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 18 శాతం దళితుల్లో ఏ ఒక్కరికీ ముఖ్యమంత్రిగా చేసే అర్హత లేదా?’ అని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img