Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రైతు సదస్సు.. కీలక అంశాలపై చర్చ

దేశంలోని 26 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతల పర్యటన తెలంగాణలో రెండో రోజు కొనసాగుతోంది. శనివారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన.. ప్రగతి భవన్‌ లో రైతు సదస్సు నిర్వహించారు. దేశంలో నెలకొన్న వ్యవసాయరంగ పరిస్థితులతో పాటు.. తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తున్న వ్యవసాయం సాగునీరు, విద్యుత్‌ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర వ్యవసాయ అనుబంధ రంగాల పురోగతిపై చర్చించారు. శుక్రవారం పలు ప్రాంతాల్లో రైతులు పర్యటించారు. వ్యవసాయం, సాగునీటి రంగాల పనితీరును పరిశీలించారు.అనంతరం ప్రగతి భవన్‌కు చేరుకున్న రైతు సంఘాల నేతలు.. వ్యవసాయం, సాగునీరు తదితర రంగాలలో తెలంగాణ ప్రగతిపై రూపొందించిన డాక్యుమెంటరీని తిలకించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img