Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

ప్రగతి భవన్‌ వద్ద జేసీ దివాకర్‌రెడ్డి..అడ్డుకున్న పోలీసులు

ఏపీ మాజీ మంత్రి ఇవాళ ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా హైదరాబాద్‌ ప్రగతి భవన్‌కు వెళ్లారు. అక్కడికి చేరుకున్న జేసీ దివాకర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి కేటీఆర్‌ను కలవాలని..లోపలికి అనుమతించాలని పోలీసులను కోరారు. అయితే ముందస్తు అనుమతి లేకుండా ప్రగతిభవన్‌లోకి అనుమతించేది లేదని భద్రతా సిబ్బంది స్పష్టంచేశారు. కాసేపు అక్కడే ఉన్న జేసీ లోపలికి సమాచారం పంపాలని మరోసారి కోరారు. ముందస్తు అనుమతి తప్పనిసరని, అలా కుదరదని తేల్చి చెప్పారు. దివాకర్‌రెడ్డిని పోలీసు వాహనంలో అక్కడి నుంచి తీసుకెళ్లారు. మధ్యలో ఆయన పోలీసు వాహనం దిగి తన వాహనంలో ఇంటికి వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img