Friday, December 1, 2023
Friday, December 1, 2023

ప్రజల ఆరోగ్యం పట్ల కేసీఆర్‌కు అస్సలు పట్టింపే లేదు : షర్మిల

విషం నీళ్లతో ప్రాణాలు పోతున్నాయని విమర్శ
తూతూమంత్రంగా భగీరథ పనులు కానిచ్చారని వ్యాఖ్య

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు గుప్పించారు. ప్రజల ఆరోగ్యం పట్ల ఎలాంటి పట్టింపు లేని దొరగారి పనితనానికి నిదర్శనం మిషన్‌ భగీరథ అని అన్నారు. స్వచ్ఛమైన నీరు ఇస్తున్నామని గప్పాలు చెప్పుకోవడమే తప్ప… మాంసం ముద్దలతో కలుషిత నీరు పంపిణీ అవుతున్నా పట్టించుకున్నది లేదని అన్నారు. నల్లాల కాడ కొట్లాటలు బంద్‌ అయ్యాయో, లేదో కానీ… విషం నీళ్లతో ప్రాణాలు మాత్రం పోతున్నాయని అన్నారు. గద్వాల్‌లో మిషన్‌ భగీరథ నీరు తాగి వందల మంది అస్వస్థతకు గురయ్యారని, ముగ్గురు చనిపోయారని తెలిపారు. 90 మంది ఆసుపత్రుల పాలయ్యారని చెప్పారు. నిర్వహణ లేని పాత ట్యాంక్‌లకు కొత్త సున్నం వేసి, పాత పైపు లైన్లకే కొత్త కనెక్షన్లు ఇచ్చి, కోట్లు కొల్లగొట్టి తూతూమంత్రంగా భగీరథ పనులు కానిచ్చి ప్రజల ప్రాణాలను కేసీఆర్‌ తీస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img