Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

ప్రజారోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు : హరీశ్‌రావు

ప్రజారోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. అందులో భాగంగానే పేదలకు తాముండే ప్రాంతాల్లోనే బస్తీదవాఖానాలను ఏర్పాటుచేశారని తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆధునిక సదుపాయాలను కల్పిస్తున్నామని అన్నారు. నిన్న రాత్రి కాకతీయ వైద్య కళాశాల ఆడిటోరియంలో జరిగిన వరంగల్‌ ఐఎంఏ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ు. హైదరాబాద్‌ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌ నగరంలో 215 ఎకరాల్లో హెల్త్‌ సిటీ నిర్మిస్తామని ప్రకటించారు. అందుకు సంబంధించిన మ్యాప్‌ ఇప్పటికే సిద్ధమైందన్నారు. 10వేల కోట్లతో రాష్ట్రంలో వైద్య వ్యవస్ధ పటిష్టతకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు.జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ దవాఖానాల్లో అందించే వైద్యంతో కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ పోటీ పడాల్సి వస్తుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img