Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి

వికారాబాద్‌ కలెక్టర్‌ నిఖిల

విశాలాంధ్ర – వికారాబాద్‌ : గత వారంలో నిర్వహించిన ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదు లను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ నిఖిల తహసీల్దార్లను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరములో భూ సమస్యలపై ప్రజల నుండి 183 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లా డుతూ, జిల్లాలో సర్వే సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, సర్వయర్‌ ల కొరత కారణంగా ఉన్న సర్వయర్లను ప్రతి రెండు మండలాలకు ఒక సర్వయర్ను సర్దుబాటు చేసి సమస్యలను పరిష్కరించాలన్నారు. కొన్ని మండలాలలో భూ సమస్యలు ఎక్క వగా ఉన్నాయని, మండల స్థాయిలో సర్వయర్లతో సమీక్షలు నిర్వహించి వాటిని వారం రోజులలో పరిష్కరించాలని ఆదేశించారు. భూ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు ఇంకా లాగిన్‌ లో 920 అపరిష్కృతంగా ఉన్నాయని, వీటిని తహసీల్దార్లు తమ స్థాయిలో చర్యలు చేపట్టి వివరాలు అందించినట్లయితే పరిష్కారించుటకు వీలు పడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి విజయకుమారి, ల్యాండ్‌ అండ్‌ సర్వే సహాయ సంచాలకులు రాంరెడ్డి, ఏ ఓ అమరేందర్‌, మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img