ప్రతిపక్షాలు విమర్శలు మానుకోవాలని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. సిద్దిపేట జిల్లాలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.ఇప్పటికైనా ప్రతిపక్షాలు విమర్శలు మానుకోవాలని, మిగతా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు, తెలంగాణలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవాలని అన్నారు. పంజాబ్ కంటే ఎక్కువ ధాన్యాన్ని పండిస్తున్నాం. పంటలు పండిరచే అతి పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం. ఏప్రిల్ నెలలో కూడా చెరువులు తొణికిసలాడుతున్నాయి. ఆషామాషీగా, తెలివి లేక ఉచిత కరెంట్ ఇవ్వడం లేదు. ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతులు ఆత్మహత్యలు ఆగిపోవాలని రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నాం అని చెప్పారు. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగం చేసేవారు కూడా గ్రామాలకు వస్తున్నారు. అద్భుతమైన గ్రామీణ తెలంగాణ ఆవిష్కృతమవుతోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతోందని అన్నారు. బ్రహ్మాండమైన పురోగతితో ముందుకు పోతున్నాం. అనేక రంగాల్లో పురోగమిస్తూ ముందుకు పోతున్నాం. కొంతమంది అవకాకులు చెవకాకులు పేలినా..మనం ముందుకెళ్లాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు.