కొవిడ్ వ్యాక్సిన్ను ఉచితంగా అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకుని కరోనా కట్టడికి సహకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కోరారు. చంద్రాయణ గుట్టలోని ఉప్పుగూడలో, పరివార్ టౌన్ షిప్లో వ్యాక్సినేషన్ సెంటర్ను సీఎస్ సందర్శించారు. ప్రభుత్వం కల్పించిన ఈ సదావకాశాన్ని ప్రజలు సద్వినియోగపరచుకోవాలని చెప్పారు. తద్వారా నగరాన్ని 100 శాతం వ్యాక్సినేటేడ్ నగరంగా తయారుచేయాలన్నారు.