Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో భరోసా : తలసాని

ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో భరోసా వచ్చిందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. హైదరాబాద్‌ అమీర్‌పేటలోని 50 పడకల దవాఖానకు దాతల సహకారంతో ఫ్రిజ్‌లు, ఏసీలు, ఫర్నిచర్‌ను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా హాస్పిటల్‌ను 100 పడకలకు పెంచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని సర్కారు దవాఖానల్లో కార్పొరేట్‌ హాస్పిటళ్లకు ధీటుగా అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వేలాది రూపాయల విలువైన వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని వెల్లడిరచారు. ప్రభుత్వం చేపట్టిన విధానాలతో ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చేవారి సంఖ్య భారీగా పెరిగిందన్నారు. రాష్ట్రం ఏర్పాడ్డాక ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతానికి చర్యలు చేపట్టామని వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img