Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం డేటా సైన్స్‌ అవసరం : మంత్రి కేటీఆర్‌

దేశంలో డేటా సైన్స్‌ రంగం వేగంగా పుంజుకుంటోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ అన్నారు. నానక్‌రామ్‌గూడ వన్‌ వెస్ట్‌లో గ్రామీనర్‌ డేటా సెంటర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, భారత్‌లో డేటా సైన్స్‌కు గత ప్రభుత్వాలు తక్కువ ప్రాధాన్యం ఇచ్చాయన్నారు. దేశంలో డేటా సైన్స్‌ రంగం వేగంగా పుంజుకుంటోందని, సాంకేతికత ద్వారా సమాజంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని తెలిపారు. ఒక్క రోజులోనే సమగ్ర సర్వే వంటి అతిపెద్ద డేటా ప్రాజెక్టు చేపట్టామని గుర్తు చేశారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం డేటా సైన్స్‌ అవసరమని కేటీఆర్‌ పేర్కొన్నారు. మున్సిపల్‌ శాఖలో పలు ప్రాజెక్టులకు గ్రామీనర్‌తో కలిసి పని చేస్తామని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img