బంగాళాఖాతంలో అండమాన్ దీవుల్లో మళ్లీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. ఇది క్రమంగా బలపడి ఈ నెల 15 వాయుగుండంగా మారే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇంతకుముందు ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఈ రెండు రోజలు వర్షాలు కురవవచ్చని తెలిపారు.