Wednesday, October 5, 2022
Wednesday, October 5, 2022

బండి సంజయ్‌పై కేటీఆర్‌ సెటైర్లు.. ఈ దేశాన్ని పాలిస్తున్నది బీజేపీ కాదా? అని ప్రశ్న

నిరుపేదలకు ఉచితంగా ఇండ్లు, విద్య, వైద్యం ఇస్తామన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. బీజేపీ మూర్ఖత్వం చూస్తుంటే విచిత్రంగా ఉందని, ఉచితాలు వద్దని ఓ పక్క విశ్వగురు (ప్రధాని మోదీ) చెబుతుంటే.. మరోపక్క విద్య, వైద్యం, ఇండ్లు ఫ్రీగా ఇస్తామని ఈ జోకర్‌ ఎంపీ హామీలుస్తున్నాడని విమర్శించారు. ఈ దేశాన్ని బీజేపీ పాలించడం లేదా అని ప్రశ్నించారు. ఉచితంగా ఇండ్లు, విద్య, వైద్యం అందిస్తామంటే మిమ్మల్ని ఎవరు ఆపారని ట్విట్టర్‌ వేదికగా నిలదీశారు. తెలంగాణ బీజేపీ ఇస్తున్న ఉచిత హామీలపై పార్లమెంటులో చట్టం చేయాలని ప్రధాని మోదీని డిమాండ్‌ చేశారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో ఉన్న పేదలకు విద్య, వైద్యం, ఇండ్లు ఉచితంగా ఇచ్చేలా చట్టాన్ని తీసుకొస్తే టీఆర్‌ఎస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img