Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

బండి సంజయ్‌పై కేసులను బేషరతుగా ఎత్తివేయాలి : ఈటెల

బండి సంజయ్‌పై కేసులను బేషరతుగా ఎత్తివేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కేసీఆర్‌ రాజ్యాంగం అమలవుతోందని మండిపడ్డారు. చక్రవర్తి మాదిరి ఎవరి మాట విననని కేసీఆర్‌ అంటున్నారన్నారు. కోవిడ్‌ నిబంధనలు ఉన్నాయనే తన సొంత కార్యాలయంలో సంజయ్‌ జాగరణ దీక్ష పెట్టుకున్నారని ఆయన తెలిపారు.శత్రు సైన్యాల మధ్య జరిగే ఘర్షణలా కరీంనగర్‌ కమిషనర్‌ వ్యవహరించారని అన్నారు. కసీఆర్‌ ప్రభుత్వాన్ని సమయం వచ్చినప్పుడు పాతరేస్తామని అన్నారు. హుజూరాబాద్‌ ఓటమి తర్వాత . కేసీఆర్‌ కాళ్ళ కింద భూమి కదులుతోందన్నారు. ఉద్యోగ సంఘాలు పట్టించుకోకపోవడం సమంజసం కాదని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img