Saturday, June 3, 2023
Saturday, June 3, 2023

బండి సంజయ్ అరెస్ట్‌పై హైటెన్షన్.. పోలీస్ స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లిన బీజేపీ కార్యకర్తలు

బండి సంజయ్ అరెస్ట్‌పై రాష్ట్రంలో హైటెన్షన్ క్రియేట్ అవుతోంది. బీజేపీ దీనిపై న్యాయపోరాటానికి సిద్దమైంది. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్‌ను బీజేపీ లీగల్ టీమ్ దాఖలు చేయనుంది. అక్రమంగా అరెస్ట్ చేశారని, వెంటనే విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును బీజేపీ కోరనుంది.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌తో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ నేతలు దీనిని తీవ్రంగా ఖండిస్తుండగా.. కార్యకర్తలు అరెస్ట్‌కు నిరసనగా ఆందోళనలు చేపడుతున్నారు. కరీంనగర్‌లోని తన ఇంటిలో బండి సంజయ్ ఉన్న సమయంలో పోలీసులు ప్రవేశించి అర్థరాత్రి ఆయనను బలవంతంగా తీసుకెళ్లారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం పొలీస్ స్టేషన్‌కు ఆయనను తీసుకెళ్లారు. దీంతో పీఎస్‌కు భారీగా బీజేపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. దీంతో పీఎస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా పీఎస్ ఎదుట ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో స్టేషన్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయగా.. కాషాయ శ్రేణులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img