Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

బహదూర్‌పుర ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌..

పాతబస్తీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్‌ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం కింద చేపట్టిన మరో ప్రాజెక్టు పూర్తయ్యింది.బహదూర్‌ పుర జంక్షన్‌ వద్ద ?69 కోట్లతో నిర్మించిన 690 మీటర్ల పొడువు ఫ్లైఓవర్‌ ను మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ ప్రారంభించారు. అంతకుముందు నగరంలోని మీర్‌ ఆలం చెరువులో ఏర్పాటు చేసిన మ్యూజికల్‌ ఫౌంటేన్‌ ను మంత్రి మహమూద్‌ అలీతో కలిసి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఎమ్మెల్యే మోజం ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img