Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

బహిరంగ చర్చకు సిద్ధమా?

మంత్రి హరీష్‌రావుకు ఈటెల సవాల్‌
హరీష్‌రావు ప్రతి మాటలో వ్యంగ్యం, అబద్దం, ఇతరుల ఆత్మ గౌరవాన్ని కించపరిచే పద్దతి ఉంటుందని.. ఆది ఆపకపోతే నీ చరిత్ర ప్రజలకు చెప్పాల్సి ఉంటుందని మంత్రి హరీష్‌ రావుని ఈటెల హెచ్చరించారు. ఓట్ల కోసం మంత్రి నీచత్వానికి దిగారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ కుర్చీకే హరీష్‌రావు ఎసరు పెట్టారని, ఆయన బండారం త్వరలో బయటపడుతుందన్నారు. తెలంగాణాలో అభివృద్ది జరగలేదని, డబుల్‌ బెడ్‌ రూమ్‌ కట్టలేదంటూ ఆరోపణలు చేశారు. హరీష్‌ రావు కుంకుమ భరిణలు పంపించి ఓట్లు అడిగేస్థాయికి దిగజారారంటూ విమర్శించారు. వీటన్నిటి మీద హుజూరాబాద్‌ అంబేద్కర్‌ చౌరస్తాలో బహిరంగ చర్చకు సిద్దమా అంటూ మంత్రి హరీష్‌ రావుకు ఈటెల సవాల్‌ విసిరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img