Friday, September 22, 2023
Friday, September 22, 2023

బాధితురాలికి న్యాయం చేయడంలో ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది

హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ
సంచలనం రేపిన జూబ్లీహిల్స్‌ మైనర్‌ బాలిక రేప్‌ ఘటనకు సంబంధించి తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ స్పందించారు. పోలీసులు ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.పోలీసులపై ప్రభుత్వం నుండి ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. ఈ కేసులో బాధితురాలికి న్యాయం చేయడంలో ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. తెలంగాణ పోలీసులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పనిచేస్తారనేదానికి ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్‌ చేయడం అందుకు నిదర్సనమని అన్నారు. తమను బ్లేమ్‌ చేసేందుకు కొన్ని రాజకీయంగా శక్తులు కుట్రలు పన్నుతున్నాయన్నారు. తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబర్‌ వన్‌ ఇతర స్టేట్‌ పోలీసులకు ఆదర్శంగా ఉన్నారని గుర్తు చేశారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించండి, పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా వహించాలని ఆయన సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img