Tuesday, January 31, 2023
Tuesday, January 31, 2023

బీఆర్‌ఎస్‌ భవనాన్ని పరిశీలించిన సీఎం

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఢల్లీిలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. ఢల్లీిలోని సర్దార్‌ పటేల్‌ మార్గ్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్న బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పనుల గురించి ఆరా తీశారు. వసంత్‌ విహార్‌కు వెళ్లిన సీఎం కేసీఆర్‌ ప్రముఖ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్‌ తేజను అడిగి వివరాలు తెలుసుకున్నారు.బీఆర్‌ఎస్‌ భవనం యొక్క రూపురేఖలు అడిగి తెలుసుకున్నారు. ఇతర పనులను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి ప్రశాంత్‌ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. వీరి వెంట ఎంపీలు కేశవరావు నామా నాగేశ్వర్‌రావు సంతోష్‌ కుమార్‌ పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని రేపు మధ్యహ్నం 12.37 నుంచి 12.47గంటల మధ్య ప్రారంభించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img