ప్రధాని మోదీ సహా ప్రముఖుల సంతాపం
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస వదిలారు. జంగారెడ్డి పార్థీవదేహం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలించి అక్కడ అరగంటపాటు ఉంచారు. పార్టీ కార్యాలయం నుంచి జంగారెడ్డి భౌతికకాయాన్ని హన్మకొండకు తరలించారు. ఈ సాయంత్రం హన్మకొండలో జంగారెడ్డికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జంగారెడ్డి మృతిపట్ల ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. జంగారెడ్డి కుమారుడు సత్యపాల్ రెడ్డికి ప్రధాని ఫోన్‌చేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జంగారెడ్డికి ప్రధానితో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ సంతాపం ప్రకటించారు.