Sunday, August 14, 2022
Sunday, August 14, 2022

బీజేపీ హయాంలో అచ్చేదిన్‌ కాదు.. సచ్చేదిన్‌ : మంత్రి హరీశ్‌

బీజేపీ హయాంలో అచ్చేదిన్‌ కాదు.., సచ్చేదిన్‌ వచ్చాయని మంత్రి హరీశ్‌ రావు ఎద్దేవా చేశారు. దేశంలో రైతులకు, నిరుద్యోగులకు కాషాయ పార్టీ చేసిందేమీ లేదని విమర్శించారు. నగరంలోని మాదాపూర్‌లో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సందర్భంగా అక్కడికి బయలుదేరే ముందు హరీశ్‌రావు మీడియాతో మాఆ్లడారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ దశ, దిశగా మారిపోయిందని చెప్పారు. రైతుబంధు, మిషన్‌ భగీరథ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని వెల్లడిరచారు. జీఎస్‌డీపీలో రాష్ట్రం వృద్ధి సాధించిందని తెలిపారు. ప్లీనరీ సందర్భంగా జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ పాత్రపై చర్చిస్తామన్నారు.బండి సంజయ్‌ పాదయాత్ర ప్రజలు లేక వెలవెలబోతోంది. దేశంలో నిరుద్యోగులకు, రైతులకు బీజేపీ చేసిందేమీ లేదని ఆరోపించారు. తెలంగాణ కంటే బీజేపీ ఏ రాష్ట్ర పాలిత ప్రాంతం బాగుందని ప్రశ్నించారు.పీకే బీజేపీతో ఉంటే గొప్పోడు..మాతో ఉంటే తప్పా అని ప్రశ్నించారు. మా పనితీరు బాగుంది. అందుకే పీకేను తీసుకున్నామని హరీశ్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img