Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

‘బుల్లెట్టు బండి’ వధువుకు బంపర్‌ ఆఫర్‌

‘బుల్లెట్టు బండి’ పాటకు ఓ వధువు పెళ్లి బరాత్‌లో అద్భుతంగా డ్యాన్స్‌ చేసిన విషయం తెలిసిందే. డ్యాన్స్‌ చేసిన ఆ యువతి సాయిశ్రీయకి ఇప్పుడు ఓ బంపర్‌ ఆఫర్‌ వచ్చింది.ఏ పాటకైతే డ్యాన్స్‌ చేసిందో ఆ పాటను నిర్మించిన సంస్థ బ్లూ రాబిట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ తమ తదుపరి పాటకు డ్యాన్స్‌ చేసే అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ నిర్వాహకురాలు ప్రకటించారు.ఈ అవకాశం రావడంతో సాయిశ్రీయ కాదనలేకపోయింది.ఈనెల 14న మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన సాయిశ్రీయకు అశోక్‌తో వివాహమైంది. అప్పగింతల సమయంలో సాయిశ్రీయ చేసిన డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img