Tuesday, January 31, 2023
Tuesday, January 31, 2023

బోధనతో పాటు పరిశోధన, విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించాలి

: మంత్రి హరీశ్‌రావు
రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యానవన యూనివర్సిటీలు డిమాండ్‌ ఉన్న పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సూచించారు.రైతుల ఖర్చులు తగ్గి లాభాలు వచ్చే వంగడాలను అభివృద్ది చేయాలన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్‌ ఉద్యాన వర్సిటీ ఏర్పాటు చేసి ఏడేండ్లు అయిన సందర్భంగా అక్కడ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గత ఏడేండ్లలో కనుగొన్న కొత్త అంశాలు, పరిశోధనలను ప్రదర్శించారు. పరిశోధన విభాగాల ప్రదర్శనశాలను హరీశ్‌రావు సందర్శించారు. ఉద్యాన వర్సిటీ సాధించిన ప్రగతిపై సుద్దాల అశోక్‌ తేజ రచించిన ప్రత్యేక గీతాన్ని మంత్రి విడుదల చేశారు. వర్సిటీ పండిరచిన పంటల విక్రయాలకు ట్రేడ్‌ మార్క్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆయిల్‌ ఫామ్‌ సాగుకు రైతులు ముందుకు రావాలన్నారు. తెలంగాణలో 20 లక్షల ఎకరాలలో, జిల్లాలో 50 వేల ఎకరాల్లో ఆయిల్‌ ఫామ్‌ సాగు లక్ష్యంగా పెట్టుకున్నాం అని తెలిపారు. ఎకరా ఆయిల్‌ ఫామ్‌ పంట సాగుకు రూ. 1,40,000లను ప్రభుత్వం రాయితీగా ఇస్తుందని చెప్పారు.. జిల్లాలోని కొన్ని గ్రామాలను యూనివర్సిటీ దత్తత తీసుకుని.. మార్పు దిశగా కృషి చేయాలి అని సూచించారు. 140 ఎకరాలు ఇస్తాం.. పరిశోధనలపై ప్రత్యేక దృష్టి సారించాలి వ్యవసాయ, ఉద్యానవన వర్సిటీలు బోధనతో పాటు పరిశోధన, విస్తరణ పై ప్రత్యేక దృష్టి సారించాలి అని హరీశ్‌రావు సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img