Friday, December 1, 2023
Friday, December 1, 2023

బ్యాంకులో కాల్పుల కలకలం


అబిడ్స్‌లోని ఎస్‌బీఐ కార్యాలయం ఆవరణలో బుధవారం మధ్యాహ్నం కాల్పుల కలకలం సృష్టించాయి. సహ ఉద్యోగి సురేందర్‌ అనే వ్యక్తిపై సెక్యూరిటీ గార్డ్‌ సర్దార్‌ ఖాన్‌ రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. పరస్పర వాగ్వాదంతో సెక్యూరిటీ గార్డ్‌ విచక్షణ కోల్పోయి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.సురేందర్‌ చెయ్యి భాగంలో 3 బుల్లెట్లు దిగడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బ్యాంక్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. సెక్యూరిటీ గార్డు సర్దార్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img