Saturday, October 1, 2022
Saturday, October 1, 2022

భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నంది. ఇప్పటికే నాలుగు రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మరోసారి పెరుగుతున్నది. గంట గంటకు ప్రవాహం ఎక్కువవుతున్నది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గోదావరి నీటిమట్టం 41.2 అడుగులుగా ఉన్నది. ప్రస్తుతం నదిలో 8,56,949 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువతో పాటు పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నదిలోకి ప్రవాహం పెరుగుతున్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img