Sunday, August 14, 2022
Sunday, August 14, 2022

భారీవర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

: జీహెచ్‌ఎంసీ అధికారులు
హైదరాబాద్‌ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. రానున్న 12 గంటల పాటు బలమైన ఈదురుగాలులతో పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. రాత్రి 10 గంటల వరకు ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయని తెలిపారు. గాలుల తీవ్రతకు మరిన్ని చెట్లు విరిగిపడే అవకాశం ఉందని అన్నారు. ప్రజలతో పాటు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరించారు. వర్షం సమయంలో ఎవరూ చెట్ల కిందకు వెళ్లొద్దని సలహా ఇచ్చారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, నగరంలో డీఆర్‌ఎఫ్‌ బృందాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరోవైపు మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img