Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే తీసుకున్న చర్యలు, తీసుకోవాల్సిన వాటిపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌తో పాటు ఇతర విభాగాల ఉన్నతాధికారులు భేటీకి హాజరయ్యారు.ఈ సందర్భంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. కొత్తగూడెం, ఏటూరునాగారం, మంగపేట ప్రాంతాల్లో పర్యవేక్షణకు సీనియర్‌ అధికారులను నియమించాలన్నారు. భైంసా, ఆర్మూర్‌కు వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపాలని సీఎం ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న ప్రజలకు రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. నిరాశ్రయులకు, వసతి, బట్టలు, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. కృష్ణా నదీ ప్రవాహం కూడా పెరిగే పరిస్థితి ఉన్నందున నాగార్జున సాగర్‌ కు ఉన్నతాధికారులను పంపించాలని ఆదేశించారు. హలికాప్టర్‌ లను మరిన్ని తెప్పించాలని, గతంలో వరదల పరిస్థితులను ఎదుర్కున్న అధికారులను వినియోగించుకోవాలని పేర్కొన్నారు.కృష్ణా నదీ ప్రవాహం కూడా పెరిగే పరిస్థితి ఉన్నందున నాగార్జున సాగర్‌ కు ఉన్నతాధికారులను పంపించాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img