Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

భువనగిరి జిల్లా అవుతుందని ఎవరూ ఊహించలే : సీఎం కేసీఆర్‌

సీఎం కేసీఆర్‌ యాదాద్రి భువనగరి జిల్లా పర్యటన కొనసాగుతున్నది.. పర్యటనలో భాగంగా ఆయన సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ కొత్త రాష్ట్రమైనప్పటికీ అనేక పెద్ద రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. భువనగిరి జిల్లా ఏర్పాటు చేసుకొని, అద్భుతమైన జిల్లా కలెక్టరేట్‌కు ప్రారంభించింకున్నందుకు జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కలెక్టర్‌ను అభినందిస్తున్నా అని అన్నారు. ‘యాదాద్రి జిల్లా ఏర్పాటును ఎవరూ ఊహించలేదు. ఉమ్మడి ఏపీలో జిల్లా ఏర్పాటు కోరినా సాధ్యపడలేదు. ఎన్టీఆర్‌ను మంచిర్యాల జిల్లా కావాలని అడిగినా ఎందుకోగాని అదీ సాధ్యపడలేదు. భువనగిరి సులువుగా అభివృద్ధి చెందే ప్రాంతం. హైదరాబాద్‌, వరంగల్‌ అద్భుతమైన కారిడార్‌గా అభివృద్ధి చెందుతాయి. అధికారుల అద్భుత పనితీరుతోనే ప్రభుత్వ కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయి.’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img