Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

భూముల విలువ పెంచుతూ ఉత్తర్వులు జారీ


తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు, భూముల విలువలు, రిజిస్ట్రేషన్‌ రుసుంలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. పెంచిన మార్కెట్‌ విలువలు ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్నాయి. దీనికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ కమిషనర్‌ను సీఎస్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలో పాత ధరల్లో రిజిస్ట్రేషన్లకు ఇంకా ఒక్క రోజే మిగిలి ఉండడంతో భూముల క్రయ విక్రయాల నిమిత్తం జనాలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు పోటెత్తారు.రాష్ట్రంలో ఏడేండ్ల తర్వాత తొలిసారి భూముల విలువను ప్రభుత్వం సవరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img