Monday, September 26, 2022
Monday, September 26, 2022

మంచి పనుల్లో నాతో పోటీ పడండి : మంత్రి కేటీఆర్‌

తన మీద పోటీ చేయాలనుకునే ఇతర పార్టీలోని యోదాను యోధ నాయకులకు పిలుపునిస్తున్నా.. మంచిపనుల్లో తనతో పోటీ పడాలని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇంటర్‌ విద్యార్థులకు ట్యాబ్‌ ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ..జిల్లాకు ఎన్నో ప్రభుత్వ విద్యాసంస్థల్ని సాధించుకున్నామన్నారు. ప్రతి జిల్లాకు మెడికల్‌ కాలేజ్‌ ఏర్పాటు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాలో ఉన్న సిరిసిల్ల వేములవాడ.. రెండు నియోజకవర్గాల అభివృద్ధికి తన శాయ శక్తులా కృషి చేస్తున్న అన్నారు. నాయకుల పుట్టినరోజు వేడుకల పేరుతో అనవసరపు ఖర్చులు చేస్తున్నారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img