టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ ఘటనలో తెలంగాణ మంత్రి కేటీఆర్ పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజిపై ప్రగతి భవన్ సూచనలతోనే సిట్ దర్యాప్తు జరుగుతోందని షర్మిల ఆరోపించారు. బాధ్యత వహించాల్సిన ఐటీ శాఖ మంత్రి (కేటీఆర్) మాకేం సంబంధం అని తప్పించుకున్నారని విమర్శించారు. కంప్యూటర్లకు భద్రత లేనప్పుడు ఇది పూర్తిగా ఐటీ శాఖ వైఫల్యమేనని స్పష్టం చేశారు. ఐటీ శాఖపై విచారణ కోరుతూ ఇవాళ హైదరాబాద్ బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో మంత్రి కేటీఆర్ పై ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో వెల్లడించారు.