రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి కరోనా సోకింది. ఇవాళ మంత్రి కరోనా టెస్టులు చేయించుకోగా ఆయనకు పాజిటివ్‌గా తేలింది. గత మూడు రోజులుగా మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. దీంతో తనతో గత కొన్ని రోజుల నుంచి కలిసి తిరిగిన వాళ్లు కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.