ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్, ఈడీలతో అజయ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనను గత నెలలోనే సీఎం కేసీఆర్‌కు నివేదించామని చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఆర్డినరీ బస్సుల్లో కిలోమీటర్‌కు 20 పైసలు, ఇతర బస్సుల్లో కిలోమీటర్‌కు 30 పైసలు పెంచాలని ప్రతిపాదించామని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ చార్జీలు ఎప్పటినుంచి పెంచాలన్న దానిపై తర్జనభర్జనలు సాగుతున్నాయి. గతంలో ప్రభుత్వం 2019 డిసెంబరు 1వ తేదీన ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించి మూడో తేదీ నుంచి అమలు చేసింది. ఛార్జీలు పెంచి బుధవారానికి రెండు సంవత్సరాలు పూర్తి అవుతుంది.