Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

మనకు ఇప్పుడే స్వాతంత్య్రం వచ్చింది…

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
74సంవత్సరాల చరిత్రలో ఏ ప్రభుత్వం గొల్ల, కురుమలను ఆదుకోలేదని, కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత తమకు స్వాతంత్య్రం వచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.హుజురాబాద్‌ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని కొత్త వ్యవసాయ మార్కెట్లో గొల్ల కుర్మలకు గొర్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌, కొప్పుల ఈశ్వర్‌ పాల్గొని లబ్దిదారులకు 500 గొర్ల యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ… ఏమీ చేతగానోడు, పనికిరానోడు, పనికిమాలిన వాళ్లు ఈ పథకంతో వచ్చేది లేదు సచ్చేది లేదని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని… అలాంటి వారికి ప్రజలే బుద్దిచెబుతారని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img