Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

మన ఊరు మన బడి’ని సమష్టిగా విజయవంతం చేయాలి : మంత్రి కొప్పుల

పెదపల్లి జిల్లాలో ప్రణాళికాబద్ధంగా ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని అమలు చేయాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో మన ఊరు-మన బడి,మన బస్తీ కార్యక్రమం అమలుపై శుక్రవారం కలెక్టర్‌, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్‌ తో కలిసి జూమ్‌ యాప్‌ ద్వారా మంత్రి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సీఎం కేసీఆర్‌ రూ.7600 కోట్లు మంజూరు చేసి మన ఊరు మన బడి కార్యక్రమం రూపొందించారని తెలిపారు. మన ఊరు మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో 12 అంశాల్లో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సమష్టిగా విజయవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img