Monday, August 15, 2022
Monday, August 15, 2022

మన బిడ్డలు కులవృత్తులు చేసుకోవాలి..కేసీఆర్‌ బిడ్డలు రాజ్యాలు ఏలాలి: షర్మిల

మన బిడ్డలు కులవృత్తులు చేసుకోవాలి..కేసీఆర్‌ బిడ్డలు రాజ్యాలు ఏలాలి అంటూ వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల మరోమారు సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. బీజేపీ ప్రజలను గాలికొదిలి మత రాజకీయాలతో పబ్బం గడుపుతోందని, విభజన హామీలను అటకెక్కించిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ కు ఓటేస్తే ఆ నేతలు కేసీఆర్‌ కు అమ్ముడుపోయారని మండిపడ్డారు. వైఎస్సార్‌ నాయకత్వాన్ని మళ్లీ తీసుకురావడమే తమ లక్ష్యమని షర్మిల పునరుద్ఘాటించారు. వైఎస్సార్‌ హయాంలో వ్యవసాయం అంటే పండుగ అని, రైతులకు ఏ కష్టమొచ్చినా వైఎస్సార్‌ ఆదుకున్నారని స్పష్టం చేశారు. కానీ, కేసీఆర్‌ రుణమాఫీ అని మోసం చేశాడని ఆరోపించారు. రైతులకు అందే పథకాలన్నీ బంద్‌ చేశాడని, ముష్టి రూ.5 వేలు ఇచ్చి రైతులను కోటీశ్వరులను చేస్తాం అంటున్నాడని మండిపడ్డారు. రైతు బీమాను 60 ఏళ్లకే పరిమితం చేసి అన్యాయం చేశాడని షర్మిల విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img