Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

మరి ఏ రాజ్యాంగం తేవాలనో..?

ప్రొఫెసర్‌ కోదండరాం
రాజ్యంగం మార్చాలి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై వివిధ వర్గాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. తాజాగా సీఎం కేసీఆర్‌పై టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం మండిపడ్డారు. మరోసారి రాజ్యాంగం మారుస్తా అనే చర్చ తెస్తే తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పోరాటాలతో తెచ్చుకున్న రాజ్యాంగం మార్చి ఏ రాజ్యాంగం తెస్తామని అనుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా పోరాటాలు ఉదృతం చేస్తామన్నారు. ముందు 317జీవో ను సవరించాలని డిమాండ్‌ చేశారు. ఫ్యూడల్‌ ఆలోచనలు ఉన్న సీఎం కేసీఆర్‌కు ఈ రాజ్యాంగం ఏం అర్థం అవుతుందంటూ ఎద్దేవా చేశారు.ఇప్పటికే తెలంగాణలో అడ్డగోలుగా జిల్లాలు ఏర్పాటుచేసిన సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు ఆ తప్పుని కప్పి పుచ్చు కోవడం కోసం స్థానికత అంటున్నారని మండిపడ్డారు.ప్రభుత్వం 317 జీవో ద్వారా ఉపాధ్యాయుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోందని అన్నారు.ఎలాంటి సం ప్రదింపుల్లేకుండా జీవోను అమలు చేయడం ఘోరమన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img