Friday, December 2, 2022
Friday, December 2, 2022

మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు..

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ నగరంలో కురిసిన కుండపోత వర్షం నగరజీవిని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. లోతట్టు ప్రాంతాలు, రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. మరోవైపు, హైదరాబాద్‌ నగరంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌ నగరంలోని ప్రజలు బయటికి వెళ్లిన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img