ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీలు, పౌర సమాజం, మహిళా సంఘ ప్రతినిధులతో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని లే మెరిడియన్ హోటల్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాల్సిన అంశంపై ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగంలో మహిళలకు సమాన హక్కులు కల్పించారని.. కానీ అవి అమలు కావడం లేదని తెలిపారు.ఆకాశంలో సగం.. ధరణిలో సగం.. అవకాశంలో సగమని మహిళలకు సమానమైన స్థానం ఉండాలని మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం భారత్ జాగృతి ఆధ్వర్యంలో పోరాడుతున్నాం. మహిళా బిల్లు ఆమోదం కోసం మొన్న జంతర్‌మంతర్‌లో ధర్నా చేశాం. దీనికి కొనసాగింపుగా ఇవాళ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నాం. ఇందులో అన్ని పార్టీలను పిలుచుకుని పార్లమెంటులో ఏం చేయాలనే దానిపై చర్చిస్తాం. వారి మద్దతు కూడగడడతాం.. ఈ మీటింగ్‌కు రాని పార్టీలపై భవిష్యత్తులో ఒత్తిడి పెంచి కలిసొచ్చేలా చేస్తాం్ణ అని కవిత తెలిపారు.