రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో రెండు రోడ్డు మార్గాల అభివృద్ధికి రూ. 45 కోట్ల నిధులు మంజూరు అయినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కోళ్ల పడకల్ నుంచి శంషాబాద్ వరకు 14 కిలోమీటర్ల మేర రోడ్డును విస్తరించి అభివృద్ధి చేసేందుకు రూ. 15కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ఆర్‌సీఐ రోడ్డు నుంచి రావిర్యాల, కొంగరకలాన్, తిమ్మాపూర్, మాదాపూర్, గుమ్మడవెళ్లి, ఆకులమైలారం గ్రామాల మీదుగా మీర్‌ఖాన్‌పేట్ వరకు రూ. 22 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ, మరమ్మతులకు రూ. 30కోట్ల నిధులు మంజూరు అయ్యాయని వివరించారు. త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభమవుతాయన్నారు. నిధులు మంజూరు చేయించినందుకు సీఎం కేసీఆర్‌కు మంత్రి సబితారెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.