Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

మాజీ సీఐ నాగేశ్వరరావు కేసులో 600పేజీల చార్జ్‌ షీట్‌

మాజీ సీఐ నాగేశ్వరరావు కేసులో పోలీసులు ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేశారు. దాదాపు రెండు నెలల పాటు నాగేశ్వరరావు జైల్లో ఉన్నారు. ఇటీవల బెయిల్‌ పై విడుదలైన మాజీ సీఐ నాగేశ్వరరావును రెండు రోజుల క్రితం సర్వీస్‌ నుంచి అధికారులు తొలగించారు. అయితే ఈ మాజీ సీఐ కేసులో 600పేజీల చార్జిషీట్‌ ను రాచకొండ పోలీసులు దాఖలు చేశారు. సీసీ ఫుటేజ్‌, డీఎన్‌ఏ రిపోర్ట్‌, వెపన్‌ దుర్వినియోగం వివరాలతో పాటు బాధితురాలు స్టేట్‌ మెంట్‌ ను పోలీసులు చార్జి షీట్‌ లో పొందుపరిచారు. కిడ్నాప్‌, ఆపై అత్యాచారయత్నం కేసులో నాగేశ్వరరావు అరెస్టయిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img