Monday, January 30, 2023
Monday, January 30, 2023

మాస్కు తప్పనిసరి

ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు ఈనెల 25 నుంచి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌ జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌ అన్నారు. ఇప్పటివరకు 82 శాతం మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారని చెప్పారు. 1768 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, 4,59,228 మంది పరీక్షలకు హాజరుకానున్నారని చెప్పారు. ఇందులో బాలురు 2,32,612, బాలికలు 2,26,616 మంది ఉన్నారని వెల్లడిరచారు. పరీక్షకు సంబంధించి మూడు సెట్ల ప్రశ్న పత్రాలు ఎంపిక చేశామన్నారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img