Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

మా టీఆర్‌ఎస్‌ సైన్యం ఎంతో మీకు తెలుసా? : తలసాని

బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడిరచి దాడికి యత్నించడం దారుణమని మంత్రి తలసాని శ్రీనివాస్‌ అన్నారు. భారీ అనుచర గణంతో మంత్రితో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్‌, మాగంటి గోపీనాథ్‌, కాలేరు వెంకటేశ్‌, ముఠా గోపాల్‌ తదితరులు భారీగా కవిత ఇంటికి చేరుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలు జరుగుతున్న సమయంలో బీజేపీ నేతలు కవిత ఇంటిపైకి రావడం దుర్మార్గమని, ఇది హేయమైన చర్య అని తలసాని మండిపడ్డారు. మీ ఇళ్ల మీదకు రావడం పెద్ద విషయం కాదని.. టీఆర్‌ఎస్‌ సైన్యం ఎంతో తెలుసా అంటూ హెచ్చరించారు.‘‘వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలు జరుగుతున్నప్పుడు బీజేపీ నేతలు కవిత ఇంటికి రావడం దుర్మార్గం. జిల్లా అధ్యక్షుడు కూడా రావడం సిగ్గుచేటు. మీ ఇళ్ల మీదకి రావాలంటే పెద్ద విషయం కాదు. మా టీఆర్‌ఎస్‌ సైన్యం ఎంతో మీకు తెలుసా? ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. వేలాది సైన్యం మాకూ ఉంది. మీ ఇళ్ల మీద దాడులు, పార్టీ ఆఫీసుల మీదకు వస్తే పరిస్థితి ఏంటి. సంఫీుభావం చెప్పడానికి వచ్చిన మా కార్యకర్తలు బీజేపీ ఆఫీస్‌ ముట్టడికి వెళ్తాం అంటున్నారు’’ అంటూ బీజేపీ నేతలకు తలసాని హెచ్చరించారు.నిన్న కవిత ఇంటి ముట్టడికి వెళ్లిన బీజేపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మొత్తం 26 మంది బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపారు. ఉదయం కోర్టు సమయంలో 26 మందిని నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లి వర్చువల్‌ ద్వారా మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. 29 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదకాగా.. ముగ్గురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img