Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

మా సీఎంను అంటే ఊరుకోం..: మంత్రి గంగుల

మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌పై మంత్రి గంగుల కమలాకర్‌ విమర్శలు గుప్పించారు. ‘‘మా సీఎంపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం’’ అని మంత్రి గంగుల కమలాకర్‌ హెచ్చరించారు. . శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. దొడ్డి దారిన సీఎం అయిన చౌహాన్‌కు.. కేసీఆర్‌తో పోలిక ఉందా?’’ అని ప్రశ్నించారు కేసీఆర్‌ ఒక్క పిలుపిస్తే భయం అంటే ఏంటో చౌహాన్‌కు చూపించేవాళ్లమని అన్నారు. టీఆర్‌ఎస్‌ తలచుకుంటే మీరు విమానం దిగేవారా? తిరిగి ఎక్కేవారా?…అని అన్నారు. బీసీలకు ఏం చేశారో చౌహాన్‌ చెప్పాలన్నారు. మధ్యప్రదేశ్‌ నుంచి వస్తున్న ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img