Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

మీ హామీలు ఏమయ్యాయి నడ్డా జీ?: మంత్రి హరీశ్‌ రావు

అబద్ధపు హామీలిస్తూ, ప్రజల గోడు పట్టని బీజేపీ నేతల్లారా ఏ మొహం పెట్టుకుని ఓట్లడగడానికి మునుగోడుకు వస్తున్నారని మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. 2016లో మర్రిగూడెం పర్యటన సందర్భంగా నాటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని మంత్రి హరీశ్‌ రావు ట్వీట్‌ చేశారు. ‘మీ హామీలు ఏమయ్యాయి జేపీ నడ్డా గారు..?. 2016లో మర్రిగూడలో నాడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా, మీరు పర్యటిస్తూ ఫ్లోరైడ్‌ రీసెర్చ్‌ అండ్‌ మిటిగేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తమన్నరు. మీరు హమీ ఇచ్చి ఆరేళ్లయింది. ఈ సెంటర్‌ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం చౌటుప్పల్‌లో 8.2 ఎకరాల స్థలం కేటాయించింది. ఆరేళ్లయినా కేంద్రం ఫ్లోరైడ్‌ రీసెర్చ్‌ సెంటర్‌కు నయా పైసా ఇవ్వలేదు. మర్రిగూడలో 300 పడకల ఆసుపత్రి నిర్మిస్తమని కూడా హమీ ఇచ్చారు. అబద్ధపు హామీలిస్తూ, ప్రజా గోడు పట్టని బీజేపీ నేతల్లారా ఏం మొహం పెట్టుకుని ఓట్లడగడానికి మునుగోడుకు వస్తున్నరు. ఈ ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పడం ఖాయం.’ అని మంత్రి హరీశ్‌ రావు ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img